రాహుల్ పై దాడి మోడీ అప్రజాస్వామిక పాలనకు పరాకాష్ట: ఉత్తమ్

హైదరాబాద్, ఆగస్ట్ 4: గుజరాత్ లోని బనస్కంత ప్రాంతం లో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పై బీజేపీ గుండాలు దాడి చేయడం ప్రధాని మోడీ అప్రజాస్వామిక పాలనకు పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. ఈ విషయమై ఆయన శుక్రవారం ఒక ప్రకటన చేశారు.

గుజరాత్.రాజస్థాన్లలో  తీవ్రమైన వరదలు, భారీ వర్షాలతో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే ఆ వరద ప్రాంతాలలో రాహుల్ గాంధీ పర్యటించి బాధితులను పరామర్శించారు. అందులో భాగంగా ఆయన శుక్రవారం గుజరాత్ లోని బనస్కంత్ లో పర్యటించారు. 

ఈ సందర్బంగా బీజేపీ కార్యకర్తలు ఆయన ప్రయాణిస్తున్న బులెట్ ఫ్రూఫ్ కార్ పైన ఇటుకలు..రాళ్లత్తొ దాడి చేశారు. దీంతో కారు్ బాగా ధ్వంసం అయిందని ఒక జాతీయ పార్టీ ఊపాధ్యక్షులపై ప్రధాన మంత్రి స్వంత రాష్ట్రంలో దాడులు జరగడం వారి పాలన విధానాలను బయట పెట్టిందని అన్నారు.

ప్రపంచంలో నే అహింసా సిద్ధాంతాన్ని నూరి పోసిన మహాత్మ గాంధీ పుట్టిన నేల పైన ఇలాంటి దాడులు జరగడం దారుణమని అన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు దేశం గర్వపడేలా ఉందని అన్నారు. దాడులకు భాద్యత వహించి ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.