4,041 మున్సిపాలిటీల్లో స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ -2018 నిర్వ‌హ‌ణ‌

హైదరాబాద్, జూలై 31: స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018 నిర్వ‌హ‌ణ‌ను దేశంలోని ఉన్న 4,041 మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లలో చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వ  మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ది మంత్రి శాఖ నేడు ప్ర‌క‌టించింది. 

2017 స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌ను దేశంలోని 434 న‌గ‌రాల్లో  చేప‌ట్ట‌గా ఈ సారి 4,041 న‌గ‌రాల్లో పారిశుధ్య, న‌గ‌రాభివృద్దికి చేప‌డుతున్న స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌కు 2వేల మార్కుల‌ను కేటాయించి స‌ర్వే నిర్వ‌హించ‌నున్నారు. అయితే 2018 స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌కు చేప‌ట్టిన ప్రామాణిక మార్గ‌ద‌ర్శ‌కాల్లో అత్య‌ధిక జీహెచ్ఎంసీ చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మాలు ఉండ‌డం విశేషం. అయితే 4,041 ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌ను జ‌నాభా లేదా విస్తీర్ణం ఆధారంగా ప‌లు విభాగాలుగా విభ‌జించి స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ నిర్వ‌హించే అంశంలో మ‌రింత స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. 2018 స‌ర్వేకుగాను ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అయితే గ‌త 2017 స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌లో మొత్తం రెండు వేల మార్కులు విధించ‌గా ఈ 2018 స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌ను 4,000మార్కుల‌కు చేప‌ట్ట‌నున్నారు.  కేటాయించిన 4వేల మార్కుల్లో  ప్ర‌ధానంగా స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై న‌గ‌ర‌వాసుల ఫీడ్‌బ్యాక్‌కు అత్య‌ధికంగా 40శాతం (1600)మార్కులు, న‌గ‌రంలో చేప‌ట్టిన ప‌లు స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాలు, వాటి ప్ర‌భావంపై అంద‌జేసే నివేదిక‌ల‌కు 35శాతం(1400), స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ స‌ర్వే బృందం నేరుగా చేప‌ట్టే క్షేత్ర స్థాయి త‌నిఖీల్లో అబ్జ‌ర్వేష‌న్ల‌కు 25శాతం(1000) మార్కులను కేటాయించారు. కాగా స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌కు స‌మ‌ర్పించిన డాక్యుమెంట్ల‌కు, క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌లో తేడా ఉంటే నెగిటీవ్ మార్కుల‌ను కూడా ప్ర‌వేశ‌పెట్ట‌డం ప్ర‌త్యేక‌త‌. 

2017లో  ఈ సారి స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌లో అమ‌లు చేసిన ప‌లు వినూత్న కార్య‌క్ర‌మాలలో ప్ర‌ధానంగా ఓపెన్ గార్బెజ్ పాయింట్ల ఎత్తివేత‌, రెండు డ‌స్ట్‌బిన్‌ల పంపిణీ విధానం, స్వ‌చ్ఛ ఆటోల ద్వారా చెత్తను వేర్వేరుగా సేక‌ర‌ణ‌, దోమ‌ల నివార‌ణ‌పై చైత‌న్య కార్య‌క్ర‌మాలు, స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం క‌ల్పించే ప్ర‌చార అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌త్యేకంగా మార్కుల‌ను కేటాయిస్తూ స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా మొట్ట‌మొద‌టిసారిగా జ‌న‌వ‌రి 2016లో స‌ర్వే నిర్వ‌హించిన 2016 స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌ను 73 న‌గ‌రాల‌లో చేప‌ట్ట‌గా మైసూర్ న‌గ‌రం క్లీన్ సిటీగా ఎంపికైంది. 2017 జ‌న‌వరి, ఫిబ్ర‌వ‌రి మాసాల్లో నిర్వ‌హించిన  స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ -2107ను 434 కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీల్లో నిర్వ‌హించగా ప్ర‌ధాన కార్పొరేష‌న్‌లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అగ్ర‌స్థానంలో నిలిచింది. అయితే 2018 స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌లో దేశంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో నిర్వ‌హించాల‌ని నేడు కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ప్ర‌క‌టించింది.